- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్..?... వెలుగులోకి సంచలన విషయాలు
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రమేయం ఉందని నిందితుడు జనార్థన్ రావు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం(Fake Liquor) ఘటనలో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) పేరు వినిపిస్తోంది. ఈ కేసులో ఏ1 నిందితుడు జనార్థన్ రావు(Janardhan Rao) విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ1 నిందితుడు జనార్ధన్ రావును అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. రహస్యంలో ప్రాంతంలో విచారించారు. జోగి రమేశ్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్ధన్ రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మద్యం వ్యాపారాన్ని ఆపేసినట్లు జనార్ధన్ రావు చెప్పారు. ఈ ఏప్రిల్ నెలలో తనకు జోగి రమేశ్ ఫోన్ చేశారని, నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పినట్లు విచారణలో జనార్ధన్ రావు వెల్లడించారు. మళ్లీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలని తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీని తొలుత ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నామని, జోగి రమేశ్ చెప్పడం వల్లే తంబళ్లపల్లెలో ప్రారంభించామని జనార్థన్ రావు తెలిపారు.
ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలన కలిగింది. తాజాగా జోగి రమేశ్ పేరు బయటకు రావడంతో కేసుపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఇప్పటి వరకూ 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సిట్ అధికారులు మరింత లోతుగా విచారించనున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ పేరు బయటకు రావడంతో ఆయన అనుచరుల్లో అలజడి రేగినట్లు తెలుస్తోంది.






