ఎలమంచిలి వద్ద ప్రమాదం.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-29 03:04:55  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పరిధిలోని ఎలమంచిలి (Yalamanchili) వద్ద ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగిన విషయం విదితమే.

ఎలమంచిలి వద్ద ప్రమాదం.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పరిధిలోని ఎలమంచిలి (Yalamanchili) వద్ద ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లోని రెండు ఏసీ బోగీలకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. దహనమైన బోగీలను రైలు నుంచి విడదీసి మరో రెండు భోగీలు జత చేశారు. అనంతరం ప్రయాణికులను ఎర్నాకుళం పంపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై రెండు ఎఫ్ఎస్ఎల్ బృందాలను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసింది. ఇప్పటికే హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో మాట్లాడి మార్గదర్శకాలను ఇవ్వగా.. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ దుర్ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ కూడా ఎలమంచిలికి చేరుకుని ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాల కోసం పరిశీలన చేశారు.

ప్రమాద నేపథ్యంలో ఎలమంచిలి మీదుగా వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్ ప్రెస్, పూరితిరుపతి, ఈస్ట్ కోస్ట్, జన్మభూమి, బెంగళూరు హంసఫర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా ప్రయాణం సాగిస్తున్నాయి. సుమారు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా రైళ్లు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు అత్యవసర ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాలని కోరారు.

రైళ్ల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు : ఎలమంచిలి - 7815909386, అనకాపల్లి - 7569305669, తుని - 7815909479, సామర్లకోట - 7382629990, రాజమహేంద్రవరం - 0883-2420541/43, ఏలూరు - 7569305268, విజయవాడ - 0866-2575167

Next Story