ఏసీబీ రైడ్స్... రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-25 15:11:14  IST  )

విశాఖలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపింది....

ఏసీబీ రైడ్స్... రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో ఏసీబీ(Acb) రైడ్స్ కలకలం రేపింది. లంచం అడిగిన ఇద్దరు ఉద్యోగులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భూమికి సంబంధించిన విషయంలో ఓ వ్యక్తి నుంచి ములగాడ ఎమ్మార్వో కార్యాలయం సర్వేయర్ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ నగేశ్ రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఈ మేరకు పథకం ప్రకారం ఎమ్మార్వో కార్యాలయంపై అధికారులు దాడులు చేశారు. సత్యనారాయణ, నగేశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story