‘ఆవకాయ అమరావతి’కి బిగ్‌ షాక్‌.. అడ్డం తిరిగిన పున్నమి ఘాట్‌ ప్రైవేట్‌ ల్యాండ్‌ ఓనర్స్‌

by Vemula.Srinu Prasad |

‘ఆవకాయ అమరావతి’కి బిగ్‌ షాక్‌ తగిలింది...

‘ఆవకాయ అమరావతి’కి బిగ్‌ షాక్‌.. అడ్డం తిరిగిన పున్నమి ఘాట్‌ ప్రైవేట్‌ ల్యాండ్‌ ఓనర్స్‌
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా(Telugu movie), సాహిత్యం(Literature), కళల వైభవాన్ని చాటించాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పర్యాటక శాఖ(Tourism Department), టీమ్‌ వర్క్‌ ఆర్ట్స్‌(Tourism Department, Teamwork Arts) సంయుక్తంగా ‘ఆవకాయ అమరావతి ఉత్సవ్’(Avakaya Amaravati Utsav) పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని కసరత్తులు చేసింది. జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు విజయవాడ వేదికగా పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ‘ఆవకాయ... అమరావతి ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇందుకు సంబంధిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

అయితే ఈ కార్యక్రమానికి ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. పున్నమి ఘాట్‌ ప్రైవేట్‌ ల్యాండ్‌ ఓనర్స్‌ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా కార్యక్రమం ఎలా చేపడతారని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా గోడలు పడగొట్టడంపై ల్యాండ్‌ ఓనర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పున్నమి ఘాట్‌లో 20 ఎకరాల వరకూ ప్రైవేటు భూమి ఉందని, తాము గోడలు కట్టుకున్నామని, తమను సంప్రదించకుండా ఎలా కూల్చివేశారని మండిపడ్డారు.

Next Story