పిడుగురాళ్లలో సెటిల్‌మెంట్లు.. పోలీస్ స్టేషన్ ఎదుట టెన్షన్.. టెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-28 12:11:44  IST  )

సీఐ సెటిల్‌మెంట్లతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది....

పిడుగురాళ్లలో సెటిల్‌మెంట్లు.. పోలీస్ స్టేషన్ ఎదుట టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: సీఐ సెటిల్‌మెంట్లతో ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల(Guntur district lightning)లో కలకలం రేపింది. సీఐ తమ ఆస్తులు రాయించుకున్నారంటూ జ్యోతి అనే మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

మరో వ్యక్తితోపాటు సీఐపై ఆరోపణలు

అయితే రూ.10 కోట్ల విలువ చేసే తమ ఆస్తిని మరో వ్యక్తితో కలిసి సీఐ వెంకట్రావు రాయించుకున్నారని బాధితురాలు ఆరోపించారు. తను భర్తను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా 20 రోజుల క్రితం జరిగిందని, తమ ఆస్తులు రాయించుకోవడమే కాకుండా తమను సీఐ వేధిస్తున్నారంటూ వాపోయారు. తనను తమ కుమార్తెను అర్ధరాత్రి వరకూ పోలీస్ స్టేషన్‌లో‌నే ఉంచి దుర్భాషలాడారని జ్యోతి ఆరోపించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

Next Story