- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లాలో పిడుగుపాటు.. ఇద్దరు మహిళలు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District)లో విషాదం చోటు చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. అయితే పెదనందిపాడు మండలం అనపర్రు(Anaparru)లో ఒక్కసారిగా పిడుగు(Thunderbolt) పడింది. దీంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగులు పడ్డాయి. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సామ్రాజ్యం, నాగమ్మగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. తోటి కూలీలు అకస్మాత్తుగా మృతి చెందడంతో మిగిలిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
Next Story






