బాపట్ల జిల్లాలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |

బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది...

బాపట్ల జిల్లాలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District)లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. బాపట్ల జిల్లాలో సూర్యలంక తర్వాత వాడరేవు, రామాపూరం బీచ్‌లకు ప్రజలు, యువకుల పెద్ద ఎత్తున వెళ్తారు ఆదివారం వస్తే ఆ రద్దీ మరింతగా ఉంటుంది. అయితే ఈ రెండు బీచ్‌ల్లో ఈ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

వాడరేవు, రామాపురం తీరంలో ఇద్దరు యువకులు స్నానం చేస్తుండగా సముద్రంలో కొట్టుకుపోయారు. ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక ఇద్దరు యువకులు మృతి చెందారు. మెరైన్ పోలీసులు ఇద్దరు యువకుల మృతదేహాలను బయట తీశారు. దీంతో రెండు బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story