- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌కు పురంధేశ్వరి ఫోన్.. తిరంగా ర్యాలీకి రావాలని పిలుపు
విజయవాడలో శుక్రవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో శుక్రవారం సాయంత్రం తిరంగా ర్యాలీ(Tiranga Rali) నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor), భారత జవాన్ల(Indian Army)కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే విజయవాడలోనూ తిరంగా ర్యాలీని నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Bjp Chief Purandeswari) నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంనుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
అయితే ఈ ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలకు సైతం పురంధేశ్వరి ఆహ్వానం పలికారు. ఇందులో భాగంగా జనసేన చీఫ్(Jansena Chief), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)కు ఆమె ఫోన్ చేశారు. తిరంగా ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి తిరంగా ర్యాలీలో పాల్గొంటానని తెలిపారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సైతం పాల్గొంటారని ఈ సందర్భంగా పురంధేశ్వరి తెలిపారు. సోఫియా ఖురేషీ, వ్యోమికాపై కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు సరికాదని పురంధేశ్వరి ఖండించారు.






