- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: చీరాల బీచ్‌లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి
బాపట్ల జిల్లా చీరాల బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District) చీరాల బీచ్(Chirala Beach)లో తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని మెరైన్ పోలీసులు(Marain Police) రక్షించారు. ఆదివారం కావడంతో 8 మంది యువకులు చీరాల బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో స్నానానికి దిగారు. ఒక్కసారిగా 8 మంది గల్లంతయ్యారు. అలల ఉధృతికి ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు మెరైన్ పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఐదుగురు కూడా ఊపిరాడక మృతి చెందారు. మిగిలిన ముగ్గురిని మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఐదుగురు మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






