Srikakulam: సముద్రంలో పడవ ప్రమాదం.... ఇంకా దొరకని మత్య్సకారుల ఆచూకీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-01 10:19:21  IST  )

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

Srikakulam: సముద్రంలో పడవ ప్రమాదం.... ఇంకా దొరకని మత్య్సకారుల ఆచూకీ
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రం(Sea)లో చేపల వేట(Fishing)కు వెళ్లిన మత్య్సకారులు(Fishermen) గల్లంతయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట(ManchineellaPet)కు చెందని నలుగురు మత్య్సకారులు ఈ రోజు తెల్లవారుజామున 4.10కి సముద్రంలోకి వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత పెద్ద తెప్ప అడ్డురావడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో సురక్షితంగా బయటకు వచ్చారు.

అయితే గల్లంతైన వారు ధన్‌రాజ్, కృష్ణ అని చెబుతున్నారు. ఇప్పటి వరకూ వాళ్లు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన వారు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. వారి కోసం సముద్రంలో మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ఉపాధి కోసం సముద్రంలోకి చేపలవేటకు తెల్లవారుజామున వెళ్లి ఉదయం 8 గంటలకల్లా తిరిగి వస్తారని, ధన్ రాజ్, కృష్ణ తిరిగి రాకపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story