గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రాసెస్‌కు తాత్కాలిక విరామం

by Vemula.Srinu Prasad |

గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రాసెస్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు..

గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రాసెస్‌కు తాత్కాలిక విరామం
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో గ్రేటర్ తిరుపతి(Greater Tirupati), గ్రేటర్ విజయవాడ(Greater Vijayawada)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రెండు గ్రేటర్ల ఏర్పాటుపై కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనాభా సర్వే పూర్తయ్యే వరకు డీ లిమిటేషన్స్ చేయవద్దనే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రాసెస్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించిరు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు.

ఫోన్లు చేయించాం

ఇక భూ సేకరణ భూముల్లో ప్లాట్లు ఇచ్చిన వారికి ఫోన్లు చేయించామని, 250 మందికి గాను 42 మంది మాత్రమే మార్చుకోవడానికి నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. 42 మందిలో 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ తీయడం కూడా జరిగిందని చెప్పారు. మిగిలిన వారిలో 8 మంది మాత్రమే తీసుకుంటామని, మిగతావారు వేచి చూస్తామని చెప్పారని మంత్రి నారాయణ అన్నారు.

Next Story