- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9వ తరగతి విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి
by Vemula.Srinu Prasad |
కడప ప్రైవేటు పాఠశాలలో విద్యార్ధిని మృతి చెందారు..

X
దిశ, కడప: కడప రాయచోటి - రిమ్స్ రింగ్ రోడ్డులోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్ధిని మృతి చెందారు. ఈ రోజు పొద్దున 7:30కి స్కూల్ యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకి ఫోన్ కాల్ వచ్చింది. అయితే విషయం దాచిపెట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తున్నామని తెలపడంతో కడప ప్రైవేట్ హాస్పిటల్‌కు 9th క్లాస్ జస్వంతి తల్లిదండ్రులు మురళి మాధవ్ హాస్పిటల్‌కి చేరుకున్నారు. తల్లిదండ్రులకు పల్స్ లేదని డాక్టర్స్ చెప్పడంతో మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనపడంతో అనుమానాస్పదంగా ఉందని స్కూల్ వాళ్ళని అడగగా బాత్రూమ్‌లో ఉరి వేసుకుందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారే తమ పిల్లని హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Next Story






