- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి
ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. నంద్యాల జిల్లా (Nandyal District)లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం (Athmakur Mandal) బైర్లూటి (Bairutly) సమీపంలో ఆటో బోల్తాపడి ఆదోని (Adoni)కి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. శ్రీశైలం (Srishailam) దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఆ కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి (Deep Condolem)ని తెలియజేశారు.






