- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలక్ట్రిక్ బైక్‌ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
by Sathputhe Rajesh |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లను ఛార్జింగ్ పెట్టారు. అయితే ఓ బైక్ బ్యాటరీ పేలడంతో షోరూంలో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. మంటలు షోరూం మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. షోరూంతో పాటు పక్కనున్న హార్డ్ వేర్ షాప్, వైన్ షాప్ లకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






