- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక శ్రీకన్య థియేటర్ సమీపంలో ఉన్న ఈ షోరూం నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం జిల్లా(Visakhapatnam District) గాజువాక(Gajuwaka)లోని ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూం(Electronics Showroom)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక శ్రీకన్య థియేటర్ సమీపంలో ఉన్న ఈ షోరూం నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
షోరూంలోని నాలుగో అంతస్తు నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. అయితే, అగ్నిమాపక యంత్రాల సాయంతో సిబ్బంది మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా నిరోధించగలిగారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.






