జనసేనలో కీలక పరిణామం: పిఠాపురం ఇంచార్జి తొలగింపు.. మరొకరికి బాధ్యతలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-15 09:24:57  IST  )

కాకినాడ జిల్లా పిఠాపురం జనసేనలో కీలక పరిణామం చోటు చేసుకుంది...

జనసేనలో కీలక పరిణామం: పిఠాపురం ఇంచార్జి తొలగింపు.. మరొకరికి బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన(Pithapuram Janasena)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురంలో గతకొంతకాలంగా వర్గవిభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) నిర్ణయించారు. ఈ మేరకు ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి శ్రీనివాస్‌ను తొలగించారు. గతంలో పార్టీ ఇంఛార్జ్‌గా ఆయన పని చేశారు. 2 నెలల క్రితం ఇంఛార్జ్‌ స్థానంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురితో కమిటీ వేశారు. మర్రెడ్డిపై వస్తున్న ఫిర్యాదులతో కమిటీ నుంచి కూడా తొలగింపు నిర్ణయం వచ్చింది. దీంతో మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిషోర్‌‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

Next Story