- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
మదనపల్లెలో దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ఏ3 మాధవరెడ్డి, ఏ4 మునిరత్నంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది..

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లెలో దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ఏ3 మాధవరెడ్డి, ఏ4 మునిరత్నంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు నిందితులు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దస్త్రాల దహనం చిన్న విషయమేమి కాదని, దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని తెలిపింది. కుట్ర పన్నేందుకు దేశంలోనే ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. పలువురు బెయిల్‌పై బయటకు వచ్చారన్న నిందితుల వాదనను తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఇంత పెద్ద వ్యవహారంలో ముందస్తు బెయిల్ కుదరదని స్పష్టం చేసింది. ఇద్దరు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది. కాగా నిందితులు ఇద్దరూ మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరులు రావడంతో కేసు ఉత్కంఠను రేపుతోంది.






