- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఆస్తుల అటాచ్‌పై అభ్యంతరాలు చెప్పాలని నిందితులకు నోటీసులు
లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ..

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను గతంలో సిట్ అధికారులు(Sit Officials) అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ ఆస్తుల అటాచ్ మెంట్‌పై సిట్ అధికారులు ఏసీబీ కోర్టు(Acb Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్ మెంట్ పిటిషన్‌పై అభ్యంతరాలు చెప్పాలని ఎస్బీఐ(Sbi), ఐసీఐసీఐ(ICICI) బ్యాంకులు, విజయవాడ ట్రెజరీ అధికారికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు నిందితులు కేసిరెడ్డి, చాణక్య, శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్, చెవిరెడ్డితో పాటు ఎంపీ డిస్టిలరీస్, ఎస్ఎన్‌జే షుగర్స్ సంస్థలకు ఏసీబీ కోర్టు నోటీసులు దాఖలు చేసింది. అయితే వరుణ్ పురుషోత్తం, ఎస్ఎన్‌జే షుగర్స్, ఎంపీ డిస్టిలరీస్ ప్రతినిధులు సిట్ పిటిషన్‌పై తమకు అభ్యంతరం లేదని తెలిపారు.






