LIquor Case: ఒకరికి ఊరట... ఇద్దరికి బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-28 12:21:26  IST  )

లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ..

LIquor Case: ఒకరికి ఊరట... ఇద్దరికి బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో ఒకరికి ఊరట కలిగితే మరో ఇద్దరికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్(Dileep)(ఏ30)తో పాటు రాజ్ కేసిరెడ్డి(Raj Kesireddy),సజ్జల శ్రీధర్(Sajjala Sridhar) బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో గురువారం విచారణ జరిగింది. దీంతో పైలా దిలీప్‌కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. పైలా దిలీప్ రాజ్ కేసిరెడ్డి పీఏగా పని చేశారు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో దిలీప్ సైతం నిందితుడిగా ఉన్నారు.. ప్రస్తుతం ఈయన కూడా జైలులో ఉన్నారు. తాజాగా బెయిల్ మంజూరు అయింది.

Next Story