- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ డబ్బులు డిపాజిట్ చేయొద్దు: కేసిరెడ్డి పిటిషన్
లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case)లో రోజుకో సంచలనం నమోదు అవుతోంది. ఇటీవల వైసీపీ(Ycp) నేతలు వరుసగా అరెస్టులవుతున్నారు. అంతేకాకుండా నిందితుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే కేసులో అరెస్టైన నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఈ మధ్యనే హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతంలో రూ. 11 కోట్లు ఉన్న బ్యాగును సిట్(SIT) పోలీసులు గుర్తించారు. దీంతో ఈ డబ్బులను ప్రధాన నిందితుడు కేసిరెడ్డివి అని టీడీపీ నేతలు ఆరోపించారు.
అటు నిందితుడు కేసిరెడ్డి(Kesireddy) సైతం స్పందించారు. ఆ డబ్బులు తనవి కావని చెప్పారు. దీంతో ఆ డబ్బులను సిట్ అధికారులు సీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కేసిరెడ్డి తరపున విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)ను ఆశ్రయించారు. రూ.11 కోట్లను బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలని న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజ్ చేసిన నోట్ల సీరియల్ నెంబర్లు నమోదు చేయకుండా బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐవో తక్షణమే హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.






