- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ నెయ్యి ఘటనపై కీలక పరిణామం.. ఏక సభ్య కమిషన్ నియామకం
by Vemula.Srinu Prasad |
కల్తీ నెయ్యి ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రిటైర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ నియామకం అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి(Tirumala Laddu Adulterated Ghee) వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం(Kutami Government) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్(Single Member Commission)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్‌లో రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించింది. టీటీడీ పరిపాలన లోపాలు, టెండర్ల సమగ్ర పరిశీలన చేసి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
నెయ్యి ఘటనలో ..
కాగా శ్రీవారి లడ్డూ నెయ్యి ఘటనలో కల్తీ జరిగిందని, కానీ జంతువుల అవశేషాలు కలవలేదని సీబీఐ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిషన్‌ను తాజాగా నియమించింది. దీంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందోనని పలువురు అంటున్నారు.
Next Story






