గాజువాకలో ఘోర ప్రమాదం.. రైల్వే బ్రిడ్జి డకింగ్ కూలి ఏడుగురికి గాయాలు

by Vemula.Srinu Prasad |

విశాఖ గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. కన్స్ట్రక్షన్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ ఒక్కసారిగా కూలింది. పిల్లర్‌కు, పిల్లర్‌కు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ..

గాజువాకలో ఘోర ప్రమాదం.. రైల్వే బ్రిడ్జి డకింగ్ కూలి ఏడుగురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ గాజువాక(Visakha Gajuwaka)లో ఘోర ప్రమాదం జరిగింది. కన్స్ట్రక్షన్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్(Railway bridge ducking) ఒక్కసారిగా కూలింది. పిల్లర్‌కు, పిల్లర్‌కు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటతో కిమ్స్ తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయ చర్యలు చేపట్టారు.

పాత బ్రిడ్జి వద్ద ఇరుకుతో....

కాగా దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని పాత బ్రిడ్జి వద్ద ఇరుకుకావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు గాజువాక తుంగ్లం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో డెక్కింగ్ స్లాబ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగింది.

Next Story