Ap News: ఏనుగుల బీభత్సం.. చేతికొచ్చిన పంట సర్వ నాశనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-09 11:08:56  IST  )

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి...

Ap News: ఏనుగుల బీభత్సం.. చేతికొచ్చిన పంట సర్వ నాశనం
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో ఏనుగుల(Elephants) గుంపు హల్ చల్ చేశాయి. పుచ్చ(watermelon), పామాయిల్(Palm oil), కొబ్బరి(Coconut), మొక్క జొన్న(Sorghum) పంటల్లో బీభత్సం సృష్టించాయి. స్థానిక అటవీ ప్రాంతం నుంచి పొలాలు వైళ్లాయి. ఇష్టమొచ్చినట్లు పొలాల్లో తిరిగాయి. ఇష్టానుసారంగా తిరుగుతూ కొబ్బరి, మొక్క జొన్న చెట్లపై దాడి చేశాయి. పుచ్చ చెట్లను తొగ్గేశాయి. దీంతో రైతులు లబో దిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటలను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును కట్టడి చేయడంలో అధికారులు విఫలమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ఏనుగులు తమ పంటలపై దాడి చేస్తున్నాయని వాపోయారు. ఏనుగుల గుంపును వెంటనే తమ పొలాల వద్ద నుంచి అటవీ ప్రాంతంలోకి తరిమివేయాలని కోరుతున్నారు.

అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని, తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారని, శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని చెప్పారు. తమ ప్రాణాలను సైతం గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కుంకీ(Kunki Elephants) ఏనుగులను తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పారని, ఆ ఆశతోనే తాము ఎదురు చూస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. మొక్క జొన్న పంటను కౌలు తీసుకుని పంట పండించానని, వారం క్రితం ఏనుగులు నాశనం చేశాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులను ఇక్కడి నుంచి తరలించి.. కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.

Next Story