- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎంపీ కన్నుమూత
ఏపీ రాజీకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనంతపురం (Anantapur) మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య (93) కన్నుమూశారు. ప్రస్తుతం కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బళ్లారి (Bellary) నివాసం ఉంటున్న ఆయన సోమవారం కొట్టాలలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో కంప్లి (Kampli)లో స్నేహితులతో మాట్లాడేందుకు కారు దిగగా అక్కడే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పుల్లయ్య పార్థివ దేహాన్ని బళ్లారిలోని తన ఇంటికి తీసుకెళ్లారు.
కాగా, పుల్లయ్య సొంతూరు అనంతపురం జిల్లా వజ్రకరూరు (Vajrakarur) మండలం ఛాయాపూరం గ్రామం. పుల్లయ్య ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1968 నుంచి 1974 వరకు ఉరవకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రెండు సార్లు గెలుపొందారు. 1977-79, 1982-85 వరకు అనంతపురం లోక్‌సభ సభ్యుడిగా పని చేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీ కన్వీనర్‌గానూ ఉన్నారు. 1965 నుంచి 1977 వరకు కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా, బీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.






