- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఏపీలో మరో అగ్నిప్రమాదం..భారీగా ఎగిపడుతున్న మంటలు
by Vemula.Srinu Prasad |
నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ముత్తుకూరు మండలం పంటపాలెం ఆయిల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలడంతో స్థానిక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చుట్టు ప్రాంతాలకు భారీగా పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలో మంటలార్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే విశాఖ అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 18మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మరువకముందే నెల్లూరు జిల్లాలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
Next Story






