Kodi katti Case: నాకు విముక్తి కల్పించండి... సుప్రీంకోర్టుకు శ్రీనివాస్ లేఖ

by Disha Web Desk 16 |
Kodi katti Case: నాకు విముక్తి కల్పించండి... సుప్రీంకోర్టుకు  శ్రీనివాస్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు జన్నపల్లి శ్రీనివాస్ (కోడి కత్తి శ్రీను) సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తనను విడుదల చేయాలని కోరారు. 1610 రోజులుగా తాను జైలులో ఉంటున్నానని.. తనకు బెయిల్ మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. తనకు జైలు నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా సార్లు కోర్టుకు విన్నవించుకున్నానని.. కానీ స్పందన రాకపోవడంతో ఈ లేఖ రాస్తున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. తనకు ఇంగ్లీష్ రాదని, తెలుగులోనే లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. కోడి కత్తితో జగన్ భుజంపై శ్రీనివాస్ దాడి చేశారు. ఈ కేసులో అప్పటి నుంచి శ్రీనివాస్ జైలులో ఉన్నారు. కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టుకు శ్రీనివాస్ లేఖ రాయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.+

గతంలో శ్రీనివాస్ తల్లి కూడా సీజేఐకు లేఖ రాశారు. తన కుమారుడు నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నాడని... తక్షణమే బెయిల్ ఇవ్వాలని కోరారు. అయినా కూడా శ్రీనివాస్ జైలు నుంచి విడుదల కాలేదు.

Next Story

Most Viewed