- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏ-14 గిఫ్ట్ అనుకుంటా ... వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: నారా లోకేశ్
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ-14 నిందితుడిగా తన పేరు చేర్చడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ-14 నిందితుడిగా తన పేరు చేర్చడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఏ-14గా తన పేరును చేర్చడం తనకు గిఫ్ట్ అనుకుంటానని అన్నారు. త్వరలోనే తాను యువగళం పాదయాత్ర ప్రారంభించబోతున్నానని దాన్ని అడ్డుకునేందుకు ఇలా అడ్డమైన కేసుల్లో తమ పేర్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏ-14గా గిఫ్ట్ ఇస్తే త్వరలో వైసీపీకి తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేశ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని అంశాల్లో కూడా తన పేరు చేర్చుతున్నారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుతో తనకేం సంబంధం అని ప్రశ్నించారు. అసలు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు అలాంటిది కేసేంటని ప్రశ్నించారు. రింగ్ రోడ్డే వేయలేదు..అలాంటిది రెండేళ్లపాటు విచారించి తనను నిందితుడిగా చేర్చుతారా అని ప్రశ్నించారు.
స్కిల్ స్కాంకు తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో తాను మంత్రిగా పనిచేశానని.. తన శాఖలు వేరే సీఐడీ తనపై మోపుతున్న అభియోగాల శాఖలు వేరు అని లోకేశ్ తెలిపారు. ఇలాంటి కేసులకు తాము భయపడేది లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఏ స్కాం జరగలేదని అన్నారు. తమ కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదని చెప్పుకొచ్చారు.
తాను కానీ తన తండ్రికానీ తన కుటుంబ సభ్యులు కానీ అలాగే తమ పార్టీ సభ్యులు గానీ ఎవరూ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌పై జాతీయస్థాయిలో ఉద్యమిస్తున్న తరుణంలో దాన్ని అడ్డుకునేందుకు తనపై అనేక ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు యాత్ర చేస్తున్నారని అలాగే యువగళం పాదయాత్ర తాను చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కకూడదనే ఉద్దేశంతో కేసులు పెట్టి జైలుకు పంపాలని వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాలను వేధిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి మరో ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం అని నారా లోకేశ్ హెచ్చరించారు.






