- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఒప్పందంతో 9వేల మందికి శిక్షణ.. మంత్రి నారా లోకేష్ వెల్లడి
ఈ ఒప్పందంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 వేల మంది యువతకు శిక్షణ లభిస్తుందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ ఒప్పందంతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 వేల మంది యువతకు శిక్షణ లభిస్తుందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావదిగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తోంది. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సోమవారం ఉండవల్లి నివాసంలో ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric) అనే సంస్థతో నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని తెలియజేశారు. అలాగే ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027 వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, NAC శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ట్రైనింగ్ ల్యాబ్ ల ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9 వేల మంది యువతకు శిక్షణ అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.






