జ్వరంతో ఆస్పత్రిలో చేరి.. గుండెపోటుతో బాలిక మృతి

by Naga Rani Yarlagadda |

గుండెపోటు.. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసులవారినీ కబళిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో ఓ పిల్లాడు ఆడుకుంటూ అస్వస్థతకు గురై తల్లి ఒడిలో పడుకుని గుండెపోటుతో (Heart Attack) మరణించాడు.

జ్వరంతో ఆస్పత్రిలో చేరి.. గుండెపోటుతో బాలిక మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటు.. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసులవారినీ కబళిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో ఓ పిల్లాడు ఆడుకుంటూ అస్వస్థతకు గురై తల్లి ఒడిలో పడుకుని గుండెపోటుతో (Heart Attack) మరణించాడు. తాజాగా కృష్ణాజిల్లాలో 8వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. పామర్రు మండలం పెదమద్దాలికి (Pedamaddali) చెందిన విద్యార్థిని గుమ్మడి లావణ్య ఈనెల 5న తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయించారు. అంతలోనే బాలిక మరణించింది. జ్వరం కారణంగానే ఆమె మరణించిందా అని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. వైద్యులు బాలికను పరీక్షించి.. ఆమె మరణానికి గుండెపోటే ప్రధాన కారణంగా తేల్చారు. దీంతో లావణ్య తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. గుండెపోటుతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story