శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి 5 గంటలు

by Thanuru Gopichand |

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివస్తున్నారు.

శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి 5 గంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో శ్రీశైలం వీధులంతా కూడా శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం దేవస్థానానికి తరలివస్తున్నారు. దీంతో దేవస్థానం క్యూలైన్లు భక్తులతో నిండిపోతున్నాయి. మల్లన్న భ్రమరాంభల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా క్యూలైన్లలో ఉండే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేశారు.

తిరుమలలో..

వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకేన్లు లేని శ్రీవారి భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని అధికారులు తెలియజేశారు. నిన్న 72,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. 29,500ల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. రూ.4.52 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

Next Story