- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్..నేటి నుంచి 5 రోజులు వర్షాలే!
ఏపీలో నేటి నుంచి దాదాపు 5 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో నేటి నుంచి దాదాపు 5 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కాస్త, ఇవాళ వాయుగుండంగా బలపడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరో 48 గంటల్లో ఆ వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
అదే సమయంలో ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. వీటి ప్రభావం కారణంగా ఏపీలో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో తేలిక పాటి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉండాలని కోరింది.






