వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు 41ఏ నోటీసులు

by Thanuru Gopichand |

వైసీపీ (YCP) నేత.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) తాడేపల్లి పోలీసుల స్టేషనుకు వెళ్లారు.

వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు 41ఏ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ (YCP) నేత.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) తాడేపల్లి పోలీసుల స్టేషనుకు వెళ్లారు. అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు మాధవ్ ను విచారించారు. అనంతరం సీఆర్పీసీ 41ఏ నోటీసులను ఇచ్చి పంపించారు. కేసు విచారణకు సహకరించాలని సూచించారు. అయితే గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లిలో మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ రాప్తాడు పర్యటనలో పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే క్రమంలో మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆతనిపై కేసు నమోదైంది.

కృష్ణా జిల్లాలో వైసీపీ నేత అరెస్ట్

కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతను గుడివాడ పోలీసులు బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూనసాని వినోద్ (Kunasani Vinod) గత కొంత కాలం నుంచి గుడివాడలో బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గుడివాడ వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ వినోద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.50 వేలు నగదుతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూనసాని వినోద్ మాజీ మంత్ర కొడాలి నానికి అనుచరుడని తెలుస్తోంది.

Next Story