- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో 30శాతం గ్రీన్ అండ్ బ్లూ ఏరియా : మంత్రి నారాయణ
రాజధాని అమరావతిని పచ్చదనంతో, జలవనరులతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు 30 శాతం 'గ్రీన్ అండ్ బ్లూ' ఏరియా అభివృద్ధిపై అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు ప్రణాళికలు రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతిని పచ్చదనంతో, జలవనరులతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు 30 శాతం 'గ్రీన్ అండ్ బ్లూ' ఏరియా అభివృద్ధిపై అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు ప్రణాళికలు రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని నగరంలో 640 కిలోమీటర్ల విస్తీర్ణంలో ట్రంక్ రోడ్లను బ్యూటిఫికేషన్‌తో పాటు అభివృద్ధి చేయనున్నామని అన్నారు. సెంట్రల్ మీడియన్లలో 450 కిలోమీటర్ల మేర, ఎల్పీఎస్ రోడ్లపై సీజనల్ పూలతో సుందరీకరణ పనులు ఉంటాయని వెల్లడించారు. అలాగే రాజధాని ప్రాంతంలో 133.3 కిలోమీటర్ల పొడవునా ప్లాంటేషన్ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వివరించారు.
ఈ ప్రణాళికలో భాగంగా ప్రజల వినోదం కోసం అనేక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. శాఖమూరు వద్ద 190 ఎకరాల్లో, మల్కాపురం వద్ద 21 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కులు, అనంతవరం వద్ద 31 ఎకరాల్లో 'లంగ్ స్పేస్ పార్కు', కురగల్లు వద్ద 200 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు, 497 చిన్న, మధ్యస్థ ఎల్పీఎస్ పార్కులతో పాటు కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ (96.6 కిలోమీటర్లు) పరిధిలో గ్రీనరీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. అలాగే, కృష్ణాయపాలెం (71 ఎకరాలు), నీరుకొండ (158 ఎకరాలు) వద్ద రిజర్వాయర్ల బ్యూటిఫికేషన్‌తో పాటు, ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలలోని దాదాపు 400 ఎకరాల హిల్ రాక్ ఏరియాను అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
శాఖమూరి పార్కులో భాగంగా 30 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్కును, 50 ఎకరాల రిజర్వాయర్‌లో బోటింగ్, మ్యూజిక్ ఫౌంటేన్, ఐకానిక్ బ్రిడ్జి వంటి సౌకర్యాలను కల్పిస్తారు. పర్యాటకులను ఆకర్షించేందుకు 10 ఎకరాల్లో ఎకో రిసార్ట్, కన్వెన్షన్ హాల్, హెల్త్ స్పా, 48 కాటేజీలతో పాటు, 15 ఎకరాల్లో అడ్వెంచర్ పార్క్ (బంగీ జంప్, జిప్ లైన్), స్నో వరల్డ్ వంటి పిల్లల ఆటలను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. ఇంకా 20 ఎకరాల్లో ప్రత్యేక ఫ్లవర్ పార్కు (దశావతార ఫ్లవర్ గార్డెన్) మరియు గ్లాస్ డోమ్‌తో నర్సరీ ఏర్పాటు ప్రణాళికలో ఉన్నాయన్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఈ పనులన్నీ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు.






