Gold Seized : ఏపీలో 18 కిలోల బంగారు నగల పట్టివేత

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులు భారీగా బంగారు ఆభరణాలు పట్టుకున్నారు(Gold Seized).

Gold Seized : ఏపీలో 18 కిలోల బంగారు నగల పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో సాధారణ తనిఖీలు చేస్తున్న పోలీసులు భారీగా బంగారు ఆభరణాలు పట్టుకున్నారు(Gold Seized). ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ప్రొద్దుటూరు(Prodduturu)లోని రామేశ్వరం బైపాస్ వద్ద పోలీసులు గురువారం సాధారణ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న ఓ కారులో తనిఖీ చేయగా.. అందులో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు. నగలను సవధీనం చేసుకొని.. పోలీస్ స్టేషన్లో ఆదాయపు పన్ను, రెవెన్యూ అధికారుల సహాయంతో వాటి విలువ రూ.15 కోట్లకు పైగా ఉంటుందని తేల్చారు. అయితే అవన్నీ హైదరాబాద్ లోని ఓ దుకాణంలో కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ బిల్లులపై విచారణ జరుపుతున్నారు.

Next Story