జగన్ కు భారీ షాక్.. సమ్మెకు పిలుపునిచ్చిన 108, 104 సిబ్బంది .

by Disha Web Desk 3 |
జగన్ కు భారీ షాక్.. సమ్మెకు పిలుపునిచ్చిన 108, 104 సిబ్బంది .
X

దిశ వెబ్ డెస్క్: గోరు చుట్టూ పైన రోకలి పోటు అన్నట్లు జగన్ కి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అంగన్వాడీ, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బంది సమ్మెలతో సతమతవుతూ.. వాళ్ళ డిమాండ్లు ఎలా పరిష్కరించాలా అని తలలుపట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి మరో బిగ్ షాక్ ఇచ్చారు 108, 104 సిబ్బంది. సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ఈ రోజు ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వనున్నారు 108, 104 సిబ్బంది.

కాగా ఈ నెల(జనవరి) 23 నుంచి సమ్మె చేయనున్నారు. అయితే ఆర్ధిక అంశాల దృష్ట్యా కాకుండా.. డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మెకు వెళ్లనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా 104 ,108 లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను RTC కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. కాగా 108, 104ను అరబిందో సంస్థ నిర్వహిస్తున్న విషయంత తెలిసిందే. అయితే 104ని హెల్త్ సెంటర్‌కి అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed