ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు రూ. 25 వేలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-05 11:13:56  IST  )

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు ప్రోత్సాహకంగా ఏపీ ప్రభుత్వం రూ. 25 వేలు ఇవ్వాలని నిర్ణయించింది..

ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు రూ. 25 వేలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు ప్రోత్సాహకంగా ఏపీ ప్రభుత్వం(Ap Government) రూ. 25 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కాబోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై అసెంబ్లీలో మాట్లాడుతూ 2023 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని తెలిపారు. ఏప్రిల్ 1 కొత్త పాలసీ అమలు చేస్తామని తెలిపారు. పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలవబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 1.5గా ఉన్న టీఆర్ఎఫ్‌ను 2.1కు తీసుకెళ్లాలని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ. 25 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story