అవ్వకు బువ్వ లేదు.. రోడ్డుపైనే జీవనం

by  |
అవ్వకు బువ్వ లేదు.. రోడ్డుపైనే జీవనం
X

దిశ, మిర్యాలగూడ: నా అనే వాళ్లు లేక ఓ అవ్వ రోడ్ల మీద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నది. నడవలేని స్థితిలో రోడ్లపై పాకుతూ, నానా అవస్థలు పడుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓ వృద్ధ మహిళ పడుతున్న గోస అంతా ఇంతా కాదు. దేహి అంటూ రహదారుల వెంట తిరుగుతోంది. ఎంతో చైతన్యవంతమైన మున్సిపాలిటీ అయినప్పటికీ… అందరూ చూసి చూడనట్టే వెళ్తున్నారు తప్ప, ఆమె బాధను తెలుసుకునే వాళ్లు కరువయ్యారు.

రోడ్లపై అనాథలా ఆమె బతుకు, మానవతా విలువల్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది. పండుముసలి వయస్సులో ఆశ్రయం లేక, ఆకలి తీర్చేవారు లేక ఆమె పడుతున్న గోస పలువురిని కంటనీరు తెప్పిస్తోంది. ఎన్నో వాగ్దానాలలో గద్దెనెక్కిన రాజకీయ ఉద్దండులు ఒక్కరు కూడా అనాథ బతుకులను ఆదుకోవటం లేదు. ప్రచార ఆర్భాటాలతో సంఘ సేవ చేసే సంస్థ అధినేతలు ఎంతమంది ఉన్నా… ఈమెకు ఒక్కరూ కూడా పరిష్కారం చూపలేకపోయారు. కాటికి కాళ్ళు చాచి ఈరోజో, రేపో అని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.

Next Story

Most Viewed