మహిళా పోలీసులకు కీలక ఆదేశాలు

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పోలీసులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి సచివాలయాలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా మహిళా పోలీసులకు యూనిఫాం భత్యాన్ని మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన ఉద్యోగులను.. ప్రభుత్వం ఇటీవల పోలీసుశాఖలో చేర్చిన […]

Update: 2021-08-08 07:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పోలీసులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి సచివాలయాలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా మహిళా పోలీసులకు యూనిఫాం భత్యాన్ని మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన ఉద్యోగులను.. ప్రభుత్వం ఇటీవల పోలీసుశాఖలో చేర్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News