స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే..సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఆరు రోజులే ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.

Update: 2024-05-07 13:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఆరు రోజులే ఉండటంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఓ వైపు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, మరోవైపు పార్టీల నేతలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజువాక మేమంతా సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే’ అని అన్నారు. ఐదేళ్లుగా నేను ఒప్పుకోలేదు కాబట్టే..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని తేల్చి చేప్పారు. పొరపాటున కూటమికి ఓటేస్తే..స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్టే అన్నారు. విశాఖ రైల్వేజోన్‌కు భూములు మేం ఇచ్చినా కేంద్రం తీసుకోలేదు. పీఎం మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ కలిసి డ్రామాలు ఆడుతున్నారు అని జగన్ ఆరోపించారు.

Similar News