వివాదంలో ఇరుక్కున్న వనమా.. ఖమ్మంలో సంచలన ఘటన

దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య సంచలనంగా మారింది. తన సూసైడ్ కి కారణం అయిన వ్యక్తుల పేర్లతో మృతుడు ఓ లేఖ సైతం రాశాడు. ఇప్పుడు ఆ లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై.. ఆయన ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా కొడుకుదే అంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వనమా మరో వివాదంలో ఇరుక్కున్నారు. మృతుడు రాసిన లెటర్ లో […]

Update: 2021-07-30 05:34 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య సంచలనంగా మారింది. తన సూసైడ్ కి కారణం అయిన వ్యక్తుల పేర్లతో మృతుడు ఓ లేఖ సైతం రాశాడు. ఇప్పుడు ఆ లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై.. ఆయన ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా కొడుకుదే అంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వనమా మరో వివాదంలో ఇరుక్కున్నారు. మృతుడు రాసిన లెటర్ లో ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్ రావు పేరు ఉండటమే దీనికి కారణం. అంతేకాదు ఆ లేఖలో మోసం చేసిన వ్యక్తులతో పాటు, పోలీస్ అధికారులు, జర్నలిస్టు సైతం ఉన్నాడంటూ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. తనను మానసికంగా వేధించడమే కాకుండా.. ఎన్నో సార్లు తన ఇంటిపైకి వచ్చి గుండాలు దౌర్జన్యం చేశారని, శారీరకంగా తనపై, తన కుటుంబంపై దాడి చేశారని ఆ లేఖలో మృతుడు వాపోయాడు.

మృతుడు లేఖలో రాసిన వివరాల ప్రకారం.. పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్లు 2021లో… బంధువు అయినటువంటి నందిగం భానుకుమార్ నిర్వహిస్తున్న చిట్టీల్లో రూ. 25 లక్షలవి 2 చిట్టీల్లో చేరాడు. 2016లో రెండు చిట్టీలు పూర్తయ్యాయి. అయితే భానుకుమార్ ను రూ. 50 లక్షలు ఇవ్వాలని కోరగా.. వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారు. అనంతరం తమ దగ్గర అంత డబ్బు లేదని, తనకు చెందిన 747 గజాల స్థిరాస్థిని దస్తావేజు రాయించి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయకుండా కాలయాపన చేశారు. అదే స్థలంలో మల్లిపెద్ది వెంకటేశ్వర్లు ఇల్లు నిర్మించుకుని కొంత కాలం నివాసం ఉన్న తర్వాత, దానిని కిరాయికి ఇచ్చాడు. అయితే భానుకుమార్ తన చిట్టీ సభ్యులలో ఒకరైన కొల్లూరు వెంకటేశ్వరరావుకు కూడా అదే స్థలాన్ని స్వాధీనపరుస్తున్నట్లు అగ్రిమెంట్ చేశాడు. వారు కూడా ఆ స్థలంలో ఇంటిని నిర్మించి కిరాయికి ఇచ్చారు. అదే విధంగా సత్తుపల్లికి చెందిన మల్లెల రామారావు కుటుంబ సభ్యులను కూడా చిట్టీల పేరుతో రూ. 5 కోట్లు మోసం చేయడంతో పోలీస్ స్టేషన్లో భానుకుమార్, ఆయన కుటుంబసభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులనుంచి తప్పించుకునేందుకు భానుకుమార్ మల్లెల రామారావు కొడుకు అయిన మల్లెల దినేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.

వీరందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్ రావుకు డబ్బులు ఇచ్చి ఎలాంటి గొడవలు లేకుండా చూడమని చెప్పారు. అంతేకాదు.. మల్లిపెద్ది వెంకటేశ్వర్లు ఆధీనంలో ఉన్న స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు వనమా రాఘవకు భారీగా డబ్బులు కూడా ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. తనపైనే తప్పుడు కేసులు బనాయించే విధంగా డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు కూడా లక్షల్లో డబ్బులు ముట్టచెప్పినట్లు మృతుడు లేఖలో ఆరోపించారు. అంతేకాకుండా రాఘవ అనుచరులు తన ఇంటిపై దాడిచేసి తనను, తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నించారని మృతుడు లేఖలో పేర్కొన్నాడు. జేసీబీ సహాయంతో ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేసి దారుణంగా తనను, తన కుటుంబసభ్యులను హింసించారని వాపోయారు. వీరికి ఓ జర్నలిస్టు కూడా తోడయ్యాడని వివరించారు. అంతేకాదు.. తన బంగారు ఆభరణాలు సైతం లాక్కున్నారని పేర్కొన్నాడు. తనను, తన కుటుంబాన్ని మాసిసికంగా హింసించి, దాడిచేశారని, భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకు రాఘవ, భానుకుమార్, మల్లెల రామారావు కుటుంబసభ్యులు, పోలీస్ అధికారులపైనే ప్రధాన ఆరోపణలు చేశాడు.

Tags:    

Similar News