ధాన్యం కొనండి బాబో..!

యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అధికారుల పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారు....

Update: 2024-05-01 03:24 GMT

దిశ, వలిగొండ: యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అధికారుల పాలనలో అష్ట కష్టాలు పడుతున్నారు. సంగెం, వర్కట్‌పల్లి గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిలిచిపోయాయి. పంటను కోసి నెల రోజులు గడుస్తున్న కేంద్రంలోని ధాన్యం కుప్పలుగా ఉండడం.. లారీలు రాక తూకం వెయ్యకపోవడంతో రైతులు నిత్యం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్‌కు తీసుకువస్తే ఇక్కడ తిప్పలు తప్పవని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు.


అధికారులు, మిల్లర్లు కుమ్మక్తే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న తతంగం ఈ సెంటర్లలో కనిపిస్తుంది. కాంటాలు ఎందుకు జరగలేవని అడిగితే మిల్లర్ల వద్ద దిగుమతి జరగడంలేదని, ఒక్క లారీ 5,6 రోజులు నిల్చోవాల్స వస్తున్నందున లారీ యజమానులు సైతం నష్టపోతున్నామని, బస్తాకు అదనంగా 5 రూపాయలు ఇవ్వాలని లారీ యజమాను రైతులతోడిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఏమి చేసినా నష్టపోయేది రైతేనని, రైతులు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం ఆయా గ్రామాల రైతులు ఏకంగా ట్రాక్టర్లలో ధాన్యం పోసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి ధాన్యాన్ని కలెక్టర్ కార్యాలయం ముందు పోసి ధర్నాకు దిగారు. దీంతో సంబంధిత అధికారులు స్పందించి వెంటనే దిగుమతి అయ్యే విధంగా, చర్యలు తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కీసరి రాంరెడ్డి, కాసుల క్రిష్ణ,మీసాల శేఖర్, బాతరాజు బాల నరసింహ, రైతులు నాగెల్లి శ్రీను, గంధ మల్ల ముత్యాలు, జక్కుల వెంకటేశం, సోలిపురం జనార్దన్ రెడ్డి, ఉండాడి సత్యనారాయణ, భీమన పోయిన ముసలయ్య, సురకంటి లక్ష్మారెడ్డి, బద్దం యాదిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


Similar News