మందు ఇస్తావా.. ఇయ్యవా.. ఫుల్ బాటిల్ కోసం TRS నేత జబర్దస్తీ(వీడియో)

దిశ‌, తెలంగాణ బ్యూరో : త‌మ్మీ ఫుల్ బాటిల్ ఇస్తావా.. ఇయ్యవా.. అంటూ టీఆర్ఎస్ నేత వైన్ షాపు సిబ్బందిపై జ‌బ‌ర్దస్తీ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ‘దిశ‌’కు చిక్కింది. వివరాల ప్రకారం.. హ‌న్మకొండ జిల్లా శాయంపేట మండ‌లానికి చెందిన టీఆర్ఎస్ నేత మనోహర్ రెడ్డి.. బుధ‌వారం సాయంత్రం స్థానిక ల‌క్ష్మీ న‌ర‌సింహ వైన్‌ షాపులో ఫ్రీగా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వైన్ షాపు ఓన‌ర్ చెబితేనే మందు ఇస్తామ‌ని […]

Update: 2021-10-07 09:33 GMT

దిశ‌, తెలంగాణ బ్యూరో : త‌మ్మీ ఫుల్ బాటిల్ ఇస్తావా.. ఇయ్యవా.. అంటూ టీఆర్ఎస్ నేత వైన్ షాపు సిబ్బందిపై జ‌బ‌ర్దస్తీ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ‘దిశ‌’కు చిక్కింది. వివరాల ప్రకారం.. హ‌న్మకొండ జిల్లా శాయంపేట మండ‌లానికి చెందిన టీఆర్ఎస్ నేత మనోహర్ రెడ్డి.. బుధ‌వారం సాయంత్రం స్థానిక ల‌క్ష్మీ న‌ర‌సింహ వైన్‌ షాపులో ఫ్రీగా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఈ క్రమంలో వైన్ షాపు ఓన‌ర్ చెబితేనే మందు ఇస్తామ‌ని సిబ్బంది చెప్పడంతో కాసేపు అక్కడే వేచిచూశాడు. షాపు సిబ్బంది ఎంతకీ మందు ఇవ్వకపోయేసరికి చివ‌రికి అక్కడి నుంచి మ‌నోహ‌ర్‌రెడ్డి వెళ్లిపోయిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.

Tags:    

Similar News