షాదీఖానా.. సమస్యల వలయంలో బందీఖాన..?

దిశ, అశ్వారావుపేట: ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా అవి కొంతమంది అధికారుల అలసత్వంతో నీరుగారిపోతున్నాయి. ముస్లింలు వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా అప్పటి ప్రభుత్వం 6లక్షల వ్యయంతో దమ్మపేట మండల కేంద్రంలో షాదీఖానా నిర్మించింది. నిర్మించిన తర్వాత కొన్ని రోజులు పాటు వివాహాలు, మీటింగులు బాగానే జరిగాయి. కానీ ప్రస్తుతం షాదీఖానా పరిస్థితి అధ్వానంగా తయారైంది. షాదీఖానా ప్రాంగణం చుట్టూ వర్షపు నీరు ఆగిపోవడంతో బురదమయంగా తయారయింది. షాదీఖానాలోని తలుపులు […]

Update: 2021-09-05 10:52 GMT

దిశ, అశ్వారావుపేట: ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా అవి కొంతమంది అధికారుల అలసత్వంతో నీరుగారిపోతున్నాయి. ముస్లింలు వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా అప్పటి ప్రభుత్వం 6లక్షల వ్యయంతో దమ్మపేట మండల కేంద్రంలో షాదీఖానా నిర్మించింది. నిర్మించిన తర్వాత కొన్ని రోజులు పాటు వివాహాలు, మీటింగులు బాగానే జరిగాయి. కానీ ప్రస్తుతం షాదీఖానా పరిస్థితి అధ్వానంగా తయారైంది.

షాదీఖానా ప్రాంగణం చుట్టూ వర్షపు నీరు ఆగిపోవడంతో బురదమయంగా తయారయింది. షాదీఖానాలోని తలుపులు కిటికీలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. గత మూడు సంవత్సరాలుగా షాదీఖానాలో ఎటువంటి వివాహ కార్యక్రమాలు, మీటింగులు జరగలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. షాదీఖానాలోని బాత్ రూంలు పూర్తిగా పాడైపోయాయి, విద్యుత్ సామాన్లు కూడా పనికి రాకుండాపోయాయి. దమ్మపేట ముస్లిం కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా షాదీఖానా పరిస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

ఆకాశాన్నంటిన ఫంక్షన్ హాల్ ధరలు..

ఫంక్షన్‌హాల్స్‌ ధరలు అధికంగా ఉండడంతో సామాన్య ముస్లిం కుటుంబాలు అధిక ధరలు వెచ్చించి శుభకార్యాలను ఫంక్షన్‌హాల్స్‌లో నిర్వహించుకోలేని పరిస్థితి ఉంది. దీంతో అప్పులు చేసి ఫంక్షన్‌హాల్స్‌లో శుభకార్యాలను నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఇది తమకు ఎంతో భారంగా మారిందని అంటున్నారు ముస్లింలు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి షాదీ ఖానాకు మరమత్తులు నిర్వహించాలని ముస్లిం కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News