రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణచైతన్య

బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య ఆ పార్టీకి రాజీనామా చేసిన మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2024-04-30 13:01 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య ఆ పార్టీకి రాజీనామా చేసిన మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివాదాలకు దూరంగా ఉండే కృష్ణ చైతన్య జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. అయినా తగిన గుర్తింపు దక్కకపోవడం, పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుతో ఉన్న సంబంధాల కారణంగా పార్టీలో ఇంత కాలం కొనసాగినా పార్టీ మార్పు అనివార్యం అయింది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మొదటి నుంచి అనుచరునిగా కొనసాగిన కృష్ణ చైతన్య ఆయన లాబీయింగ్ తో ఎట్టకేలకు బీఆర్ఎస్ వీడారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని, ప్రచారంలో పాల్గొంటానని వెల్లడించాడు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా యువజనులను సమాయత్తం చేస్తానని పేర్కొన్నారు.

Similar News