బ్యాక్టీరియాను చంపే LG కొత్త ఇయర్‌బడ్స్‌..

దిశ,వెబ్‌డెస్క్: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ భారత మార్కెట్‌లోకి ‘LG Tone Free FP..telugu latest news

Update: 2022-03-16 16:40 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ భారత మార్కెట్‌లోకి 'LG Tone Free FP సిరీస్ ఇయర్‌బడ్స్‌'ను విడుదల చేసింది. దీని ధర రూ.13,990. ఈ ఇయర్‌బడ్‌లకు ప్రత్యేకమైన లక్షణం ఉంది. అతినీలలోహిత కాంతితో ప్రత్యేకమైన UVnano చార్జింగ్ క్రెడిల్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ఇయర్‌బడ్‌లలో ఉండే బ్యాక్టీరియాను 99.9శాతం చంపుతుంది.

"LG Tone Free ఇయర్‌బడ్‌లు ప్రత్యేకమైన UV నానో, మెరిడియన్ టెక్నాలజీతో వినూత్నమైన ఫీచర్‌లతో అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ ఇయర్‌బడ్‌లు పరిశుభ్రత పరంగా శానిటైజ్ చేయబడుతాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో వస్తాయి. ఇది 3 విభిన్న పరిమాణాలలో మెడికల్ గ్రేడ్ సిలికాన్ ఇయర్ జెల్‌తో వస్తుంది. LG టోన్ యాప్‌లోని ఇయర్‌బడ్స్ ఫైండర్ టూల్‌‌ ఆప్షన్‌ను కలిగి ఉంది. వినియోగదారులు Google లేదా Apple Play Store నుండి టోన్ ఫ్రీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News