నో ముద్దు పాలసీ పక్కన పెట్టేసిన కీర్తి సురేష్.. ఆ బాలీవుడ్ హీరోతో డీప్ లిప్ లాక్.. అందుకేనా?

మహానటిగా మన్ననలు అందుకున్న కీర్తి సురేష్.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బిజీ అయిపోతుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి

Update: 2024-05-23 02:44 GMT

దిశ, సినిమా: మహానటిగా మన్ననలు అందుకున్న కీర్తి సురేష్.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బిజీ అయిపోతుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే బాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ' మహానటి ' ని మించిన హిట్ మాత్రం అందుకోలేక పోయింది. భవిష్యత్తులో అలాంటి అవకాశం ఉంటుందనే ఆశ కూడా సినీ ప్రియులకు లేదు. ఆమె ఎంచుకునే ప్రాజెక్ట్స్ అలాంటివి మరి. నార్త్ లో పాగా వేసేందుకు తాపత్రయపడుతున్న బ్యూటీ కథల సెలక్షన్ పై దృష్టి పెట్టడం లేదని బాధపడుతున్నారు కూడా. ఇదే అభిమానులకు ఒక బాధ అంటే మరో రిగ్రెట్ ఫీల్ అయ్యే న్యూస్ హల్ చల్ చేస్తోంది.

'తేరి' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న భామ.. దక్షిణాది పరిశ్రమలో పెట్టుకున్న నో ఆన్ స్క్రీన్ కిస్ పాలసీని పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా.. తనతో లిప్ లాక్ సీన్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు తనపై ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోలు అయితేనే అలా చేస్తావా? అందులో ఏం మజా ఏముంది? తెలుగు, తమిళ్ హీరోలు అందుకు పనికిరారా? లేక అక్కడే పాతుకు పోవాలనే ప్రయత్నమా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఇన్నాళ్లు మన అమ్మాయిగా ఉన్న కీర్తికి విమర్శలు తప్పవని అంటున్నారు. అలా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

Similar News