అందుకే పెళ్లి చేసుకోవడం లేదు.. కల్కీ ఈవెంట్‌లో షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన పెళ్లి ముచ్చట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. కాబోయే వధువు ఇలా ఎన్నో వార్తలు సోషల్

Update: 2024-05-23 02:54 GMT

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించిన పెళ్లి ముచ్చట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. కాబోయే వధువు ఎవరో తెలుసా అంటూ.. ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. అయితే వీటన్నింటికీ బ్రేక్ వేస్తూ.. తాజాగా ప్రభాస్ తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. టాలీవుడ్ డార్లింగ్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమా కల్కీ. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కీ 2898ఏడీ బుజ్జి వర్సెస్ భైరవ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ప్రభాస్ కల్కీ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. కమల్ హాసన్, అమితాబ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, మూవీ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్, నటీనటులు ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పెళ్లిపై తానే పంచ్ వేసుకొని అందరినీ నవ్వించాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. కల్కీ మూవీ ఈవెంట్‌కు స్పెషల్ హోస్ట్ వస్తున్నారని నిర్మాతలు పెట్టిన పోస్ట్‌కు చాలా మంది అమ్మాయిల హార్ట్ బ్రేక్ అయ్యాయని, వారి కోసమే నేను పెళ్లి చేసుకోవడం లేదంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇకనైనా ప్రభాస్ పెళ్లి వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

Similar News