సమంత పోస్ట్‌పై RCB ఫ్యాన్స్‌ రచ్చ.. కారణం అదేనా

‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత అందరికీ సుపరిచితమే. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-05-23 02:50 GMT

దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత అందరికీ సుపరిచితమే. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో తన అందం, నటనతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. సోషల్‌ మీడియాలో మాత్రం వరుసగా పోస్ట్‌లు చేస్తూ.. అప్డేట్స్‌ ఇస్తూ.. తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత చేసిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ చూస్తే.. ఆమె ఎవరిని ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు. కానీ నెటిజనులు మరీ ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం.. రచ్చ రచ్చ చేస్తున్నారు.

తాజాగా సమంత తన ఇన్‌స్టాలో.. ఎవరిని ఉద్దేశించి అనేది చెప్పకుండానే.. నువ్వు గెలవడం నేను చూడాలి.. నీ హృదయం ఏది కోరుకున్నా.. నీ ఆకాంక్షలు ఏవైనా.. నేను నీ కోసం నిలబడతాను.. నువ్వు గెలవడానికి అర్హుడివి అనే క్యా‍ప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్‌ కోహ్లిని ఉద్దేశించే ఈ పోస్ట్‌ చేసిందని.. ఆమె కూడా ఆర్సీబీ గెలుపునే కోరుకుంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా గతంలో చాలా ఇంటర్వ్యూల్లో.. సమంత విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మరి నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌లో 4 వికేట్ల తేడాతో ఆర్సిబీపై ఆర్ ఆర్ గెలిచిన విషయం తెలిసినదే.

Similar News