అగ్నిప్రమాదంలో దగ్ధమైన ధాన్యం

ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని కొత్తూరు మొట్లగూడెంలో మధ్యాహ్నం 3 గంటలకు అగ్నిప్రమాదం

Update: 2023-06-02 12:39 GMT

దిశ‌, ఏటూరునాగారం : ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని కొత్తూరు మొట్లగూడెంలో మధ్యాహ్నం 3 గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన బంగారి నగేష్, పొదెం పాపయ్యల ఇళ్లు పూర్తిగా కాలిపోగా బంగారి వెంకట క్రిష్ణ కల్లంలోని 30 బస్తాల ధాన్యం పాక్షికంగా దగ్దమయ్యాయి. కొత్తూరు మొట్లగూడెం గ్రామపంచాయతీ భవనం వెను ఉన్న వరి పంట పొలాల్లో ఇటీవలే కోతలు పూర్తి కాగా ‘వరి కొయ్యకాలు కు గుర్తు తెలియని గ్రామస్తులు మంటలు పెట్టారు. ఈ క్రమంలో పంట పొలాల్లోని గడ్డి కాలుతూ ఒక్కసారిగా మంటలు చెలరేగి సమీపంలోని బంగారి నగేష్, పొదెం పాపయ్యల ఇళ్లు అంటుకున్నాయి. ఇదే క్రమంలో బంగారు వెంకట క్రిష్ణ కల్లంలో కాంటాకు సిద్దంగా ఉన్న 30 బస్తాల దాన్యంకు సైతం మంటలు అంటుకోవడంతో గ్రామస్తులు గమనించి మంటలార్పడంతో పాక్షికంగా దగ్గమయ్యాయి.

ఈ సమయంలో గ్రామంలోని ప్రజలంతా ఇంటిపట్టునే ఉండడంతో వెంటనే మంటలను అదుపు చేసేందుకు తీవ్రం యత్నించారు. గ్రామపంచాయతీకి చెందిన వాటర్ టాంకర్, ఇళ్లలోని మోటార్లు వేసి మంటలను అదుపులోకి తేవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. మరో పక్క ఈదురు గాలులు లేకపోవడంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గత ఏడాది సైతం మే నెలలో పంట పొలాల్లోని కొయ్యకాలు గడ్డికి మంటలు పెట్టడంతో మండలంలోని శనిగకుంటకు చెందిన సుమారు 42 ఇళ్లు పూర్తిగా దగ్ధమై గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలకు అందుబాటులో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో భారీ నష్టం చోటుచేసుకుంటుంది. ఇప్పటికైనా ఏటూరు నాగారం కేంద్రంగా ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉంచి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News