సైబర్ బెదిరింపులతో తస్మాత్ జాగ్రత్త

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, మాట్లాడుతూ సైబర్ బెదిరింపులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో మీకు తెలియని వారికి దూరంగా ఉండాలని, ప్రజలు సైబర్ బెదిరింపులకు గురైతే తెలియపరచాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2022-12-09 16:46 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్ : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, మాట్లాడుతూ సైబర్ బెదిరింపులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో మీకు తెలియని వారికి దూరంగా ఉండాలని, ప్రజలు సైబర్ బెదిరింపులకు గురైతే తెలియపరచాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యకాలంలో ప్రజలు సామాజిక మాద్యమాల్లో ఎక్కువగా ఉంటున్నారు.

కనీస అవగాహన లేకుండా సోషల్ మీడియాను వాడటం వలన ఎక్కువగా సైబర్ బెదిరింపులకు లోనవుతున్నారు. ఆడవారు, మగవారు అని తేడా లేకుండా అందరూ వేదింపులకు గురి అవుతున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు, టీనేజర్లు బెదిరింపులకు గురి అయితే వెంటేనే తల్లితండ్రులకు తెలపాలి. ఇటువంటి నేరాలు మీకు జరిగి సైబర్ నేరస్తుల చేతిలో మొనపోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సం : 1930 కి కాల్ చేసి లేదా NCRP పోర్టల్(www.cybercrime.gov.in) లో సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.

Similar News